FbTelugu

‘పోతిరెడ్డిపాడు’పై అఖిలపక్షం ఏర్పాటు చెయ్యాలి: చాడ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 203 పై తెలంగాణలో రగడ నడుస్తోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంపు నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను రద్దుచేసేవరకు పోరాడుతామన్నారు. ఎల్లుండి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల రైతుసంఘాల నేతలతో సమావేశమై కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలని అన్నారు.

You might also like