FbTelugu

రాత్రిపూట మాటలు… తెల్లారి తూటాలు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రతి రోజు రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తుందని, దీనికి సంధానకర్తగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు.

రాత్రి పూట అంతా కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకోవడం… ఉదయం సరభి నాటకానికి తెర లేపడం… ఇదే గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో జరుగుతోంది రేవంత్ రెడి విమర్శించారు. ఎన్నికల తర్వాత పీవీ.నరసింహారావు, ఎన్టీఆర్ పేర్లను కూడా బీజేపీ ఉచ్ఛరించదన్నారు. ప్రజలు ఇలాంటి ఆరోపణల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అన్నారు. పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ-ఎంఐఎంలు తుచ్ఛరాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమన్నారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమా భారతి లను గౌరవించుకోలేని బీజేపీ పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని రేవంత్ ఆరోపించారు. 29న నగరానికి వస్తోన్న అమిత్ షా ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే భారతరత్నపై ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి డిమాంద్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.