FbTelugu

అల్ల‌రికిట్ట‌య్య‌@ 60!!

మామా ఓ పెగ్గులా.. అన్నా ఆయ‌న‌కే చెల్లింది..

క‌త్తుల‌తో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానన్నా త‌న‌కే ద‌క్కింది.

పంచెక‌ట్టులో పెద్ద‌రికం.. మీస‌క‌ట్టులో పౌరుషం.. డైలాగ్ డెలివ‌రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌. పైకి ఎంతో గంబీరంగా క‌నిపించే న‌ట‌సింహం.. మ‌న‌సు వెన్న‌. కోపాన్ని దాచుకోలేడు.. సంతోషాన్ని పంచకుండా ఉండ‌లేడు. అందుకే.. నంద‌మూరి అభిమానుల‌కు బాల‌య్య అల్ల‌రికిట్ట‌య్య మ‌న‌సులో మిగిలాడు.

కాలం మారినా.. త‌మ అభిమానం మాత్రం మార‌దంటూ నిరూపించుకుంటున్నారు. వ‌య‌సు పెరుగుతున్నా.. త‌న అభిమానుల‌ను అల‌రించే సినిమాల‌కు.. ప్ర‌యోగం చేద్దామంటూ ద‌ర్శ‌కులు అడిగితే రెఢీ అంటూ.. కుర్ర‌హీరోల‌కూ పోటీనిస్తున్ననంద‌మూరి న‌ట‌సింహం.. 60వ పుట్టిన‌రోజు. 1974లో తాత‌మ్మ‌క‌ల‌తో సినీరంగ ప్ర‌వేశం చేసిన బాల‌య్య‌.. హిట్లు.. ఫ‌ట్లూ.. అన్నింటినీ చిరున‌వ్వుతో చ‌విచూస్తూ ముంద‌డుగు వేస్తున్నారు. ఇటు రాజ‌కీయంగా.. అటు వెండితెర‌పై సింహంగా.. ఎదురులేని లెజండ్‌గా.. కొన‌సొగుతున్నారు. స‌మ‌యం లేదు మిత్ర‌మా…! పౌరాణికంలో న‌ట‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రాముడి వారుసుడిగా బాల‌కృష్ణ ప‌లికిన‌ డైలాగ్‌లు. తెలుగోడి పౌరుషానికి ప్ర‌తీక‌గా నిలిచే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిని క‌ళ్లెదుట చూపాయ‌నే చెప్పాలి.

తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివే వ‌‌య‌సులోనే కెమెరా ముందుకు వ‌చ్చిన బాల‌య్య న‌ట‌సింహంగా ఎదిగాడు. దేశ‌, విదేశాల్లోని నంద‌మూరి అభిమానులు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి ఎన్టీఆర్ ద‌ర్శ‌కత్వంలో తాత‌మ్మ‌క‌ల సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలిసారి కెమెరా ముందుకు వ‌చ్చినా ఏ మాత్రం తోట్రుపాడు ప‌డ‌కుండా స‌హ‌జమైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌రువాత ప‌దేళ్ల‌కు అంటే 1984లో సాహ‌స‌మే జీవితం సినిమాలో హీరోగా న‌టించారు. 1984లో \విడుద‌లైన‌ మంగ‌మ్మ‌గారి మ‌నుమ‌డు మాత్రం మాస్ హీరోగా నిలిపింది. ఆ త‌రువాత కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్నో సినిమాలు న‌టించారు. ముద్దుల కృష్ణ‌య్య‌, మువ్వ‌గోపాలుడు, అల్ల‌రికృష్ణ‌య్య‌, ముద్దుల మావ‌య్య‌, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి వంటి వాటిలో పంచ‌కట్టుతో అల‌రించారు.

బాల‌య్య 50 వ సినిమా నారీనారీ న‌డుమ‌మురారీ కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మాంచి హిట్ అందుకుంది. ఆదిత్య 369, బైర‌వ‌ద్వీపం వంటి వాటితో తాను ప్ర‌యోగాల‌కు రెడీ అని చాటారు. కృష్ణార్జున విజ‌యం అనే సినిమా వ‌చ్చినా అనుకున్నంత హిట్‌కాలేదు. గుండ‌మ్మ‌క‌థ‌, న‌ర్త‌న‌శాల ఈ త‌రానికి త‌గిన‌ట్టుగా తీయాల‌నేది బాల‌య్య క‌ల‌. కానీ..ఆ నాటి పాత్ర‌ల‌ను పోషించేందుకు స‌రైన న‌టీన‌టులు లేర‌నే ఉద్దేశంతో అలాగే ఉండిపోయాయి. 100 సినిమా గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణితో విజ‌య‌దుందుబి మోగించారు. పైసావ‌సూల్‌తో పాట‌పాడి అల‌రించిన‌.. బాలయ్య తాజాగా ఎన్టీఆర్ న‌టించిన జ‌గ‌దేక‌వీరునిక‌థ సినిమాలోని శివ‌శంక‌రీ.. పాట‌ను ఆల‌పించి వీనుల‌విందు చేశారు.. ఇప్పుడు అదే సోష‌ల్ మీడియా ట్రెండ్‌సెట్ట‌ర్‌గా మారింది. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమాపై బాల‌య్య మాత్ర‌మే కాదు.

అభిమానులూ బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన‌.. ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు అనుకున్నంత‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా.. సూప‌ర్‌డూప‌ర్ హిట్ కొట్టాల‌ని బాల‌య్య బాబు క‌సిమీద ఉన్నార‌ట‌.

You might also like

Leave A Reply

Your email address will not be published.