FbTelugu

త్వరలో వైద్య కాలేజీ ఏర్పాటు: ఆళ్లనాని

అనంతపురం: హిందూపురం పార్లమెంట్ పరిధిలో త్వరలో ఓ వైద్యకాలేజీని ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఇవాళ ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించి మాట్లాడారు.

వైద్య కాలేజీ నిర్మాణం కోసం దాదాపు రూ.400 కోట్లతో పనులు జరగనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఈ సంవత్సరం ఆగస్టులో టెండర్లు పిలుస్తామని తెలిపారు. అయితే మెడికల్ కాలేజీ ఎక్కడ నిర్మిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. స్థలం పరిశీలన తో పాటు అధికారులతో ఆయన సమీక్షించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.