FbTelugu

చెరువులు బాగుంటే అన్ని వృత్తులూ బాగుంటాయి: కేటీఆర్

సిరిసిల్ల: చెరువులు బాగుంటే అన్ని వృత్తుల వారూ బాగుంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాకు కాళేశ్వరం జలాలు చేరుకున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ స్థానిక ఊరచెరువు వద్ద జలహారతి ఇచ్చి మాట్లాడారు.

మన చెరువులు నిండుతుంటే, మన పొలాలు పచ్చబడుతుంటే విపక్షాలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు. గోదావరి గమనాన్నే మార్చేసిన అపర భగీరథుడు కేసీఆర్ అని అన్నారు. సిరిసిల్లలో 665 చెరువులను గోదావరి నీటితో నింపుతామని అన్నారు. భూగర్భ జలాలు ఆరు మీటర్ల మేర పెరిగాయని అన్నారు. ఇక తెలంగాణలో హరిత, నీలి, క్షీర విప్లవాలు రాబోతున్నాయని అన్నారు.

You might also like