FbTelugu

ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్యసేవలు

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇకనుంచి అన్ని రకాల వైద్యసేవలు ప్రారంభించాలని డీఎంఈ రమేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని రకాల సేవలు, సర్జరీలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రత్యేక జాగ్రత్తలతో ఇకపై అన్ని సర్జరీలను చేయాలని డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. గాంధీ, చెస్ట్ ఆస్పత్రులు కరోనా నోడల్ ఆస్పత్రులుగా కొనసాగుతాయని తెలిపారు. వైద్యులు పిపిఈ కిట్లు, ఎన్-95 మాస్కులు ధరించాలని తెలిపారు.

రోగులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రోగులతో సంబంధం లేకుండా ప్రత్యేక జ్వరం క్లీనిక్ లు నడపాలని తెలిపారు. ఒక వేల కరోనా లక్షణాలున్న వ్యక్తులొస్తే ఐసోలేషన్ కు తరలించాలని తెలిపారు.

You might also like