FbTelugu

స్వర్ణ ప్యాలెస్ లో అన్నీ అక్రమాలే: విచారణ కమిటీ

విజయవాడ: రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని విచారణ కమిటీ తేల్చింది. విచారణలో కమిటీ పేర్కొన్న కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలను ఉల్లంఘించింది. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా, డబ్బు సంపాదించాలనే యావతోనే నియమాలను, చట్టాలను పట్టించుకోలేదు. కోవిడ్‌ చికిత్స ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ.. అవసరం ఉన్నా, లేకున్నా ఖరీదైన రెమ్‌డెసివర్‌ అన్ని కేటగిరీల పేషెంట్లకూ వాడారు.

ఎలాంటి అనుమతి లేకుండానే రమేశ్‌ ఆస్పత్రి ప్లాస్మా థెరఫీ నిర్వహించింది. హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించకుండానే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారని తెలిపింది. అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు గాని, నిరభ్యంతర పత్రంగాని, అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు నివారించే వ్యవస్థలుగాని స్వర్ణప్యాలెస్‌లో లేవు. బిల్డింగుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా లేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.33.69లక్షల పన్ను బకాయిలు కట్టలేదు.

You might also like