FbTelugu

భజన లో రూ.2.5 కోట్ల నోట్ల వర్షం

హరిద్వార్: ఆధ్యాత్మిక భజనల్లో ఒక లక్ష లేదా ఐదు లక్షల రూపాయల నోట్ల వర్షం కురిపించారని మనం ఇంత వరకు విన్నాం. కాని హరిద్వార్ లో నిర్వహించిన ఒక భజన కార్యక్రమంలో రూ.2.5 కోట్ల నోట్ల కట్టలు వెదజల్లారు.

అఖిల భారతీయ శ్రీ పంచ నిర్మోహీ అఖాడా మంగళవారం సాయంత్రం భజన నిర్వహించారు. ప్రఖ్యాత కళాకారుడు కీర్తిదాన్ గడ్వీ భక్తి గీతాలతో ఆలపించి భక్తులను మైమరపించారు. ఆయన భజనలకు ముగ్ధులైన పలువురు భక్తులు రూ.2.5 కోట్ల నోట్ల ను వెదజల్లారు. ఈ వార్త ఉత్తరాఖండ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.