FbTelugu

అన్ని ఎంట్రన్స్ లు వాయిదా

హైదరాబాద్: తెలంగాణలో అన్ని ఎంట్రన్స్ టెస్టులు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టుకు తెలియచేసింది.
ఇవాళ ప్రవేశ పరీక్షలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది. గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తే, పరీక్షలు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై మధ్యాహ్నం 2.30 ప్రభుత్వం నుంచి వివరణ ఇస్తామని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. ఆ ప్రకారంగానే ప్రభుత్వం తరఫున తీసుకున్న నిర్ణయాన్ని తెలియచేశారు.

రాష్ట్రంలో బుధవారం నుంచి జరగాల్సిన అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తరఫున హైకోర్టుకు తెలియచేశారు. ఇందులో ఎంసెట్ మొదలు అన్ని రకాల ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.