FbTelugu

అందరి కళ్లూ ఆ వైపే..

all-are-watching-rtc-problem

తెలంగాణలో అందరి కళ్లూ ఆ వైపే చూస్తున్నాయి. అసలేం జరిగింది.. ఏం జరుగుతోంది.. ఏం జరగబోతోంది అన్నదే ఇక్కడి ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ. ఎవరి నోట విన్నా అదే మాట. అదే ఆర్టీసీ సమ్మె. సమ్మె ఏ వైపు వెళుతోంది. దీనికి పరిష్కారం ఏమిటి అన్నదే అందరి నోళ్లలో నానుతోంది.

ఆర్టీసీ దారెటు?

ఆర్టీసీ కార్మికులు 33 రోజలుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పైగా విధుల్లో చేరకుంటే ఉద్యోగాలు ఊడినట్టేనని సీఎం రెండుసార్లు డెడ్‌లైన్లు విధించారు. అయినా, కార్మికులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకసార్లు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎలాంటి మలుపు తిరగబోతోందన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

కోర్టు ఏం చెప్పనుంది?

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని.. కార్మికులను సమ్మె విరమించుకోవాలని మేం ఆదేశించలేం అని ఇప్పటికే హైకోర్టు చెప్పింది. పైగా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా.. అంటూ నిలదీసింది. వాస్తవాలతో ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పైగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కోర్టుకు రావాలని ఆదేశించింది. దీనిపై గురువారం హైకోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే, కోర్టు ఏం చెబుతుంది.. ప్రభుత్వం నివేదికలో ఏం చెబుతుంది. కార్మికుల అభిప్రాయం ఎలా ఉండబోతుందన్న విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు.

ఆర్టీసీకి ప్రభుత్వం కొత్త మెలిక

ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి వేల కోట్ల రూపాయలు రావాలని.. అవి చెల్లిస్తే ఆర్టీసీ నష్టాల్లోనుంచి లాభాల్లోకి వస్తుందని ఇప్పటిదాకా చర్చ జరిగింది. కానీ, ప్రభుత్వం ఈ విషయంలో ఒక్కసారిగా బాంబు పేల్చింది. తాము ఆర్టీసీకి ఏమీ బాకీ లేమని.. రోడ్డు పన్నుల పేర ఆర్టీసీనే ప్రభుత్వానికి బాకీ ఉందని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి ముగింపు ఉంటుందోనన్న విషయం అందిరిలో ఆసక్తిగా మారింది.

You might also like