FbTelugu

బ్లాక్ లిస్టులోకి అలీబాబా?

వాషింగ్టన్: ఇప్పటికే స్వదేశంలో నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్న చైనా దేశానికి చెందిన అలీబాబా కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీనీ బ్లాక్ లిస్టులో పెట్టేందుకు యూఎస్ఏ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ సంస్థతో పాటు సోషల్ మీడియా గేమింగ్ సంస్థ టెన్సెంట్ ను కూడా బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ వార్త ప్రచురించింది. ఇది కరెక్టు అనే విధంగా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నిర్ణయం కూడా తీసుకున్నారు. అలీబాబా గ్రూపునకు చెందిన యాంట్ గ్రూప్ ఆధ్వర్యంలోని అలీ పే, టెన్సెంట్ గ్రూపునకు చెందిన వీ చాట్ పే సహా 8 యాప్ లపై నిషేధం విధించారు.

ట్రంప్ నిర్ణయంతో అలీబాబా షేర్లు మరుసటి రోజే 5 శాతం పడిపోయాయి. దీంతో పాటు టెన్సెంట్ షేర్లు కూడా ఢమాల్ అన్నాయి. ఈ పరిణామాలతో పలువురు ముదుపర్లు తమ పెట్టుబడులను అలీబాబా గ్రూపు నుంచి వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ నిర్ణయాలను నూతన అధ్యక్షుడు జో బైడెన్ కొనసాగిస్తారా లేదా సడలిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఈ రెండు కంపెనీల్లో యూఎస్ పెట్టుబడులు 1.3డాలర్లు ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకుంటే అలీబాబా పని అయిపోయినట్లేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.