FbTelugu

అలీబాబా సంస్థపై రూ.7300 కోట్ల జరిమానా?

బీజింగ్: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాపై భారీ ఫెనాల్టీ వేసేందుకు చైనా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. మార్కెట్ గుత్తాధిపత్యం ఉల్లంఘించిందన్న కారణంగా ఈ గ్రూపుపై రూ.7300 కోట్లు (100 కోట్ల డాలర్లు) జరిమానా విధించే అవకాశాలున్నాయి.

ఇదే కనక అమలైతే దేశంలో అత్యధిక జరిమానా విధించిన సంస్థగా అలీబాబా అవతరించనున్నది. అమెరికా చిప్ తయారీ కంపెనీ క్వాల్ కామ్ 2015లో పోటీ ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 97.5 కోట్ల డాలర్లను చెల్లించింది. గత కొద్ది నెలలుగా చైనా ప్రభుత్వం, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా మధ్య మాటల యుద్దం నడుస్తోంది. చైనా ప్రభుత్వం నిరంకుశ, నియంత్రిత విధానాలపై ఆయన విమర్శలు చేశారు. జాక్ మా తీవ్ర వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న చైనా ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలోని కంపెనీలపై గురి పెట్టింది. ఆయన గ్రూపునకు చెందిన ఫిన్ టెక్ ఐపీఓను నిలిపివేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.