FbTelugu

అలియా ఫ్లాట్ ధర ఎంతో తెలుసా?

ముంబై: రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతున్న నటీమణి అలియా భట్ అతను నివసించే అపార్ట్ మెంట్ లో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. ముంబై పాలిహిల్ లో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను సొంతం చేసుకున్నది.

రణబీర్ ఏడో అంతస్తులో ఉండగా, అలియా ఐదవ అంతస్తులో ఖరీదు చేసిందంటున్నారు. ఈ అపార్ట్ మెంట్ రణబీర్ కపూర్ తల్లిదండ్రుల నివాసం కృష్ణరాజ్ బంగ్లకు అతి సమీపంలో ఉంది. కాబోయో భర్తకు, అత్తారింటికి దగ్గర్లోనే ఫ్లాట్ కొనుగోలు చేసిందని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. నూతన కొనుగోలు చేసిన ఫ్లాట్ లో గత నెలలో అలియా భట్ పూజలు నిర్వహించింది. అందంగా తిర్చిదిద్దే బాధ్యతను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కు అప్పగించింది. ప్రస్తుతం అలియా తన సోదరి షాహిన్ భట్ తో కలిసి జుహూ లో నివాసముంటున్నది. ఈ ఫ్లాట్ కోసం ఆమె రూ.32 కోట్లు వెచ్చించిందంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.