FbTelugu

మరో ఐదు రోజులు అప్రమత్తం సుమా…

ఢిల్లీ: ఏపీ, తెలంగాణ ప్రజలు మరో ఐదు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

గత రెండు రోజులుగా భానుడు భగభగ మంటున్న విషయం తెలిసిందే. కనిష్టంగా 43 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వాతావరణ కేంద్రం అధికారుల అంచనా ప్రకారం ఏపీ, తెలంగాణ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతాయన్నారు.

మరో ఐదు రోజుల పాటు ఎండల ధాటి ఉండనున్నందున అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని వాతావరణ కేంద్రం పౌరులకు స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.