FbTelugu

జంట హత్యల్లో అలేఖ్యది కీలక పాత్ర!

* పునర్జన్మని నమ్మి చెల్లిని హతం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లె జంటహత్యల కేసులో రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అలేఖ్య పునర్జన్మను నమ్మినట్టుగా తెలుస్తోంది. పెంపుడు కుక్కను చంపి తిరిగి బతికించానని విచారణలో తెలిపినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నెల 16న దివ్య దెయ్యంపట్టినట్టు పిచ్చిపిచ్చిగా ప్రవరించింది. దీంతో దివ్య తల్లి పద్మజ భూతవైద్యుడు సుబ్బయ్యతో తాయెత్తు కట్టించింది.

దివ్యకు దెయ్యం వదిలిస్తానంటూ అలేఖ్య డంబెల్ తో గట్టిగా దివ్యతలపై కొట్టింది. బలంగా కొట్టడంతో దివ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. చనిపోయిన దివ్యను బతికించాలంటే తననూ చంపాలని అలేఖ్య తల్లిని కోరింది. అలేఖ్య కోరిక మేరకు డంబెల్ తో తల్లి పద్మజ కొట్టి చంపేసింది. మధ్యాహ్నం 2 గంటలకు దివ్యను అలేఖ్య చంపగా.. 4:30 కి అలేఖ్యను పద్మజ హతమార్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.