FbTelugu

ఏపీకి అక్రమంగా మద్యం రవాణా

కర్నూలు: తెలంగాణ నుంచి ఏపీకి కొందరు దుండగులు అక్రమంగా మద్యాన్ని రవాణాచేస్తున్నారు. పూల బొకేలు, చేపల రవాణా పేరుతో భారీగా మద్యాన్ని లారీలో తరలిస్తుండగా పట్టుబడినట్టు అధికారులు వెల్లడించారు.

ఇలా అక్రమంగా లారీల్లో మద్యం రవాణా చేస్తుండగా.. టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్టు తెలిపారు. ఏపీలో మద్యంపై 75 శాతం రేట్లు పెంచిన నేపథ్యంలో తెలంగాణలో చౌకగా దొరుకుతున్న మద్యం వైపు దుండగులు కన్నేస్తున్నట్టు తెలుస్తోంది.

You might also like