FbTelugu

రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

హైదరాబాద్ నగరంలో మద్యం ప్రియులు ముందు జాగ్రత్త పడడంలో ముందున్నారనే చెప్పవచ్చు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ క్షణమైనా హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారేమో అన్న అనుమానంతో ముందస్తు జాగ్రత్తగా.. భవిష్యత్తుకు సరిపడా ఇప్పుడే కొనేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మద్యం షాపులు డిపోల నుంచి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తున్నాయి. సీఎం ప్రకటన తర్వాత కేవలం 2 రోజుల్లోనే రూ.350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రోజుకు సగటున రూ.100 కోట్లు అమ్ముడౌతున్నట్టు సమాచారం.

You might also like