FbTelugu

ఆదాయానికే ఆబ్కారీశాఖ పెద్దపీట

* అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యానికి అనుమతి

* ఓ పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వద్దంటున్న వైనం

హైదరాబాద్: దేశం మొత్తం కరోనా మహమ్మారి వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలా అని ప్రయత్నిస్తుంటే.. తెలంగాణ ఆబ్కారీ శాఖ మాత్రం కాసుల వేటలో పడ్డట్టే తెలుస్తోంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో విందులు వేడుకలను ప్రజలు పూర్తిగా విస్మరించాలని అనేక మంది మేథావులు తెలుపుతున్నప్పటీ.. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి 12:00 గంటల వరకూ మద్యం తాగేయొచ్చంటూ బార్ల తలుపులు బార్లా తెరిచేసింది.

ఇప్పటికే బార్లలో మద్యాన్ని రాత్రి 1:00 గంట వరకూ అందించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. హైదరాబాద్‌లో ఇవాళ మూడు కమిషనరేట్ల పరిధిలో అడుగడుగునా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆబ్కారీ శాఖ తీరు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.