FbTelugu

అప్రమత్తమైన తెలంగాణ వైద్య శాఖ

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యులు, సిబ్బందిని రెండుగా విభజించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీచింగ్ మెడికల్ కాలేజీలతో పాటు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆస్పత్రిలోని వైద్యులతో పాటు ఇతర సిబ్బంది రెండు విభజించాలన్నారు. ప్రతి బ్యాచ్ కు 7 రోజుల పాటు క్వారంటైన్ అమలు చేయాలని, ఒక బ్యాచ్ ముగిసిన తర్వాత మరో బ్యాచ్ క్వారంటైన్ కి వెళ్ళాలని సూచించారు.

కరోనా విజృంభన నేపథ్యంలో అందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. డ్యూటీలో ఉన్న వైద్యులకు కానీ వైద్య సిబ్బందికి కానీ ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్ చేసి కరోనా టెస్టులు చేయాలన్నారు. ప్రతి ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ విధిగా వ్యక్తిగత రక్షణ కోసం పిపిఇ కిట్, మాస్కు ధరించాలని ఆయన కోరారు.

You might also like