FbTelugu

చైనా కంపెనీపై ఎలన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు

కాలఫోర్నియా: ప్రముఖ అమెరికా వాణిజ్యవేత్త ఎలన్ మస్క్ చైనాకు చెందిన ఒక కంపెనీ పై విరుచుకుపడ్డారు. తన కంపెనీ నుంచి డేటా చోరికి పాల్పడి, దాని సాయంతో ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేస్తున్నదని ఆరోపించారు.
టెస్లా కంపెనీ అధినేత అయిన మస్క్ ఎలక్ట్రికల్ వాహనాలు తయాచేస్తున్నారు. చైనాకు చెందిన జిపెంగ్ సంస్థ తమ కంపెనీ నుంచి డేటా చోరీ చేసిందన్నారు.

పాత సాఫ్ట్ వేర్ ను దొంగిలించిందని, దానితో వాహనాలు తయారు చేస్తున్నదన్నారు. గతంలో యాపిల్ కంపెనీ నుంచి ఈ సంస్థ డేటా చేరీ చేయించిందన్నారు. 2018 లో జరిగిన ఈ ఘటనలో ఒక ఉన్నత ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడని మస్క్ ట్వీట్ చేశాడు.
జిపెంగ్ కోసమే ఈ డేటా చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడన్నారు. అప్పట్లో ఈ చోరీ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. ఇప్పుడు కూడా అదే కంపెనీ తమ సంస్థ నుంచి డేటా చోరీ చేసిందని మస్క్ ట్వీట్ లో వివరించాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.