FbTelugu

నేడు అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై విచారణ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ దూరపు బంధువుల కిడ్నాప్ కేసులో ఆంధ్రా మాజీ మంత్రి అఖిలప్రియా రెడ్డి భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆయన కోసం తెలంగాణ ప్రత్యే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

బుధవారం సాయంత్రం వైద్య పరీక్షల పూర్తి తరువాత అఖిల ప్రియను ప్రత్యేక జడ్జీ ముందు హాజరు పర్చారు. ఆమెను 14 రోజుల రిమాండ్ కు విధిస్తూ తీర్పునివ్వడంతో చంచల్ గూడ మహిళా జైలుకు రాత్రి తరలించారు. ఆమె బెయిల్ పిటిషన్ పై ఈరోజు కోర్టులో విచారణ జరగనున్నది. అఖిలప్రియ గర్భవతి కావడం, ఫిట్స్ కూడా వస్తుండటంతో బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.