FbTelugu

అఖండ బాలకృష్ణ…

హైదరాబాద్: బిబి3 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటి వరకు హీరో బాలకృష్ణ  సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తూ వచ్చిన మువీ మేకర్స్‌.. ఆసక్తికి తెర దించుతూ ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు ధీటుగా టైటిల్‌ను ‘అఖండ’ అని ఖరారు చేశారు.

ఉగాది సందర్భంగా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు టీజర్‌ను కూడా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇది వరకు విడుదలైన ఓ టీజర్‌లో బాలకృష్ణ ఓ లుక్‌ విడుదల చేసిన చిత్రయూనిట్‌.. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ‘అఖండ’ టీజర్‌లో బాలకృష్ణ మరో లుక్‌ను విడుదల చేసింది. పరమేశ్వరుడికి సంబంధించినో శ్లోకం బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంది. మ్యూజిక్ సెన్సేషనల్‌ ఎస్‌.తమన్‌ మరోసారి తన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో సన్నివేశాలను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.