FbTelugu

3జీ సేవలకు ఎయిర్ టెల్ మంగళం

Airtel-Windup-3G-services

ముంబై: త్రీజీ సేవల నుంచి తప్పుకోవాలని ఎయిర్ టెల్ నిర్ణయించింది. ఇప్పటికే హర్యానా, పశ్చిమ బెంగాల్ లో 3జీ సేవలను నిలిపివేసింది. వచ్చే ఏడాది మార్చి కల్లా దశల వారీగా దేశవ్యాప్తంగా 3జీ సేవలను నిలిపివేయనున్నట్లు ఎయిర్ టెల్ సీఈఓ గోపాల్ విఠల్ తెలిపారు. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు 3జీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అయితే 2జీ సేవలను కొనసాగిస్తామని, ఆదాయం వస్తున్నంత వరకు ఈ సేవలు కొనసాగిస్తామని ప్రకటించారు.

You might also like