FbTelugu

కంగనా దెబ్బకు విమానయాన సంస్థలకు షాక్

ఢిల్లీ: దేశంలో విమానయాన సంస్థ లకు కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరద్ధంగా విమానంలో ఎవరైనా వీడియోలు, ఫొటోలు తీసినట్లు కన్పిస్తే రెండు వారాల పాటు సర్వీసు నిలిపివేస్తామని హెచ్చరించింది.

ఈ నెల 9న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబై కు వచ్చారు. ఇండిగో విమానంలో వచ్చిన ఆమెను విమానంలో నే మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. కరోనా విపత్కర సమయంలో నిబంధనలు గాలికి వదిలేసి దగ్గరదగ్గరగా నిల్చున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. పలువురు డీజీసీఏ కు ట్వీట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై డీజీసీఏ అధికారులు ఘాటుగా స్పందించి, అధికారికంగా ప్రకటన వెలువరించారు.
డీజీసీఏ కు చెందిన డైరెక్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ ముందస్తు అనుమతి ఉంటే తప్ప ఎవరు కూడా విమానంలో వీడియోలు, ఫోటోలు తీయకూడదని స్పష్టం చేసింది. కొన్ని విమానయాన సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని, విఫలమవుతున్నాయని పేర్కొంది. ఇక నుంచి ఇలాంటి ఉల్లంఘనలు తమ దృష్టికి వస్తే ఆ మరుసటి రోజు నుంచే చర్యలు ఉంటాయని హెచ్చరించింది. రెండు వారాల పాటు ఆ మార్గంలో విమానాల రాకపోకలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఆ తరువాత కూడా అన్ని చర్యలు తీసుకున్న తరువాతే రాకపోకలను అనుమతిస్తామని డీజీసీఏ వెల్లడించింది.

You might also like