FbTelugu

భోపాల్ లో కుప్పకూలిన విమానం

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు బిషన్ ఖేడి గ్రామంలో పైలెట్ల తో వెళ్తున్న విమానం ప్రమాదవశాత్తు సాగు భూమిలో కుప్పకూలింది. ఈ సంఘటనలో ముగ్గురు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు.

గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం నాడు విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో గాయపడిన పెలట్లను సమీప ఆసుపత్రికి తరలించారు. విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే ఈ ఘటన జరగింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి గుణ కు బయలుదేరుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.