FbTelugu

పూర్తిగా మహిళా పైలెట్లతో ఎయిరిండియా రికార్డు!

* శాన్ ఫ్రాన్సిస్కో నుంచి భారత్ కు సుదీర్ఘ ప్రయాణం
బెంగళూరు : భారతీయ నారీ శక్తిని ప్రపంచానికి చాటేలా.. ఎయిరిండియా మరో అరుదైన ఘట్టాన్ని మరికాసేపట్లో పూర్తిచేయనుంది. పూర్తిగా మహిళా పైలెట్లు, సిబ్బందితో ఎయిర్ ఇండియా విమానం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి భారత్ (బెంగళూరు) కు చేరుకోనుంది.

ఈ విమానం ఉత్తర ధ్రువం మీదుగా ఎక్కడా ఆగకుండా సుదీర్ఘ ప్రయాణం (16,000 కి.మీ) చేసి బెంగళూరుకు చేరుకోనున్నది. ఈ సుదీర్ఘ ప్రయాణం ప్రపంచానికి భారత నారీశక్తిని తెలియజేయనున్నది. విమాయాన చరిత్రలో చారిత్రాత్మక ఘట్టానికి ఇది నాంది పలుకుతోంది. ఈ అరుదైన ఘట్టం కోసం భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.