FbTelugu

విమాన ప్రమాదంలో 14 మంది మృతి

తిరువనంతపురం: కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 14 మంది చనిపోయారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది.

మొత్తం 123 మందికి గాయలైనట్లు సమాచారం వస్తోంది. ఇవాళ రాత్రి 7.45 గంటల సమయంలో వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి బయలుదేరి కాలికట్ విమానాశ్రయానికి చేరుకున్నది. రన్ వే పై ల్యాండ్ అవుతున్న సమయంలో కుండపోతగా వర్షం కురిసింది. దారి కన్పించకపోవడంతో అదుపుతప్పింది. పైలట్ దీపక్ సాతే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ సీఎం పినరయ్ విజయన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

You might also like