FbTelugu

కేంద్రానికే సవాల్ విసిరిన ఏయిర్ ఇండియా ఉద్యోగులు

న్యూఢిల్లీ: ఏయిర్ ఇండియా. దీనికో ఘనమైన చరిత్ర ఉంది. మహారాజా మాదిరి ఈ విమానాల్లో ప్రయాణాలు ఉంటాయి. ప్రతి భారతీయుడికో ఒక అనుభూతి. అయితే నష్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం దీన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నది.

అయితే బిడ్డింగ్ చివరి రోజు ఏయిర్ ఇండియా ఉద్యోగులు రంగ ప్రవేశం చేశారు. సుమారు 201 మంది ఉద్యోగులు 51శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ చేశారు. ఈ మేరకు వారు కమర్షియల్ బిడ్ కూడా దాఖలు చేసి కేంద్రానికి ప్రత్యక్షంగా సవాల్ విసిరారు. ఉద్యోగుల తరఫున ఏయిర్ ఇండియా కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షీ మల్లిక్ బిడ్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా మీనాక్షీ మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ మేము ఆసక్తి వ్యక్తీకరణను తెలియచేశామని, మాకు ఆర్థిక అండదండలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. ప్రతి ఒక్కరం రూ.1 లక్ష చొప్పున సమకూర్చుకున్నామని, బిడ్ కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నామని ఆమె వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక మెలిక పెట్టింది. ఈ బిడ్ లో ఏయిర్ ఉద్యోగులు కాని, ఉద్యోగ సంఘాలు కాని పాల్గొనవద్దని ప్రకటించింది. అయినప్పటికీ పాల్గొని ఆసక్తి వ్యక్తీకరణ చేయడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.