FbTelugu

సమ్మర్ బొనాంజా… రూ.999కే ఫ్లైట్ టికెట్

ముంబయి: ఎయిర్ ఇండియా సమ్మర్ బొనాంజాను ప్రకటించింది. వేసవికాలంలో పర్యాటకుల కోసం 60వేల టికెట్లకు చౌక ధరకు విక్రయించాలని నిర్ణయించి సేల్స్ కూడా ప్రారంభించింది.

ఇవాళ ప్రారంభమైన టికెట్ల సేల్ మార్చి 15వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ ద్వారా ప్రయాణీకులు ఏప్రిల్ 1వ తేదీ 2021 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ 2021 మధ్య ప్రయాణాలు చేయవచ్చు. టికెట్ ప్రారంభ ధర రూ.999 గా నిర్ణయించారు. ఎవరైతే ముందుగా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్-బెల్గాం, అహ్మదాబాద్-కాండ్లా, బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-కొజికోడ్, ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ప్రయాగ్ రాజ్ నగరాలకు టికెట్లు లభ్యమవుతాయి. టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న తరువాత ఏదైనా కారణం చేత తేదీలను మార్చుకోవాలని అనుకునేవారు ప్రయాణానికి వారం రోజుల ముందు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. తేదీల మార్చుకునేందుకు ఎలాంటి రుసుం వసూలు చేయరు.

You might also like

Leave A Reply

Your email address will not be published.