FbTelugu

గాజాపై వైమానిక బాంబుల మోత

జేరుసలేం: ఇజ్రయెల్ దేశం ఏమాత్రం అవకాశం దొరికినా వదలకుండా హమాస్ ఉద్యమకారులపై దాడులు చేస్తున్నది. హమాస్ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న అనుమానంతో గాజాలోని ఖాన్ యూనిస్ పై ఇజ్రాయెల్ విమాన బాంబులు కురిపించింది.

బుధవారం తెల్లవారు జామున విమాన దాడులతో ఖాన్ యూనిస్ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదకర పదార్థాలతో నింపిన బెలూన్లను గాజా నుంచి వదులుతున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దాడుల తరువాత ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. ఈ దాడులపై హమాస్ కూడా ప్రతిస్పందించింది. జేరుసలేంలో పవిత్ర ప్రదేశాల్లో హక్కును కాపాడుకోవడడానికి ప్రతిఘటన కొనసాగిస్తామని హెచ్చరించారు. గత నెలలో ముస్లింలకు పవిత్రమైన ఆల్ అక్సా మసీదు వద్ద స్థానికులు, భద్రతా దళాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. షేకర్ జర్రా, సిల్వాన్ వద్ద పాలస్తీనియులను ఖాళీ చేయించే క్రమంలో శుక్రవారం నాడు ప్రార్థనలకు వచ్చిన వారికి, దళాలకు మధ్య గొడవ జరిగింది. దీని తరువాత హమాస్ ఉగ్రవాద సంస్థ రాకెట్ దాడులు సింది. ప్రతి మూడు నిమిషాలకో రాకెట్ ను వదలడంతో ప్రతిగా ఇజ్రాయెల్ ఎఫ్-16 యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో పౌరులు భారీ సంఖ్యలో చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.