FbTelugu

8వారాల్లో మరో ముప్పు: ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిక

న్యూఢిల్లీ: లాక్ డౌన్ ఎత్తేశారు, కేసులు తగ్గుముఖం పట్టాయని స్వేచ్ఛగా తిరగవద్దని ఏయిమ్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు.
దేశంలో రానున్న ఎనిమిది వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ పై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఆయన మరింత బలం చేకూర్చుతూ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకుండా ఉండాలన్నారు.

ప్రజల జాగ్రత్తల ఏ మేరకు పాటిస్తారనే దానిపై థర్డ్ వేవ్ తీవ్రత ఆధారపడి ఉంటుందని గులేరియా హెచ్చరించారు.
ఇంత జరుగుతున్నా ప్రజలు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు లేదని, ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితి ఊహించని స్థాయికి వెళ్తుందన్నారు. బ్రిటన్ దేశాన్ని గడగడలాడిస్తున్న డెల్టా రకం వైరస్ ప్రస్తుత వైరస్ కన్నా బలమైంది, వేగంగా ఊపిరి తీస్తుందన్నారు. ఇది ఎప్పటికప్పుడు తన రూపాన్ని మూర్చుకుంటున్నదన్నారు. బ్రిటన్ దేశంలో రెండు నెలల క్రితం అతి తక్కువ శాతం ఉండగా ఇప్పుడు 70 శాతం డెల్టా వైరస్ కేసులే ఉన్నాయని అన్నారు. ఇంతకు ముందు కరోనా వేవ్ మూడు నెలల కాలం పట్టేదని, వైరస్ రూపాంతరం చెందడంతో తక్కువ వ్యవధిలోనే మరో వేవ్ వస్తున్నదన్నారు. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, హాట్ స్పాట్ లలో కరోనా టెస్టులు చేయాలని, ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా మినీ లాక్ డౌన్ లు విధించడం తప్ప మరో గత్యంతరం లేదని గులేరియా వ్యాఖ్యానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.