FbTelugu

లాక్ డౌన్ తప్పదు: ఏయిమ్స్ చీఫ్ గులెరియా

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో నానాటికి పరిస్థితులు దిగజారి దయనీయంగా మారాయని ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం మినహా మరో గత్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించనట్లయితే కోలుకోలేని స్థితి దేశం చేరుకుంటుందని ఆయన తెలిపారు. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నా చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తుందని, కట్టడి కావడం లేదని అన్నారు. కేసులు పెరుగుదల కారణంగా ఆసుపత్రులలో ఆరోగ్య సదుపాయాలతో పాటు సిబ్బంది కూడా లభ్యం కావడం లేదన్నారు. ఇటువంటి విపత్కర సమయాల్లో అప్రమత్తంగా లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయన్నారు. ప్రపంచంలో ఈ విధంగా కేసులు వస్తే ఏ ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ తరహా పనిభారాన్ని మోయదని రణదీప్ గులేరియా అన్నారు.

వ్యాక్సిన్ వేసుకుంటే మనల్ని వైరస్ ఏమి చేయలేదనే ధైర్యంతో ఎవరూ నిబంధనలు పాటించడం లేదని ఆయన అన్నారు. వైరస్ లో మార్పులు ఏర్పడితే హెర్డ్ ఇమ్యునిటీ వైరస్ ను తట్టుకోదని, కార్చిచ్చులా వ్యాప్తి చెందుతూ వినాశనం సృష్టిస్తుందని ఆయన హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.