FbTelugu

బీజేపీని ఓడించాం: ఓవైసీ

* అగ్రనేతలు పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోయింది
* మత రాజకీయాలను ఎదుర్కొనే సమర్థుడు కేసీఆర్

హైదరాబాద్: నగరంలో బీజేపీ అగ్రనేతలు పర్యటించిన డివిజన్లలో, పాతబస్తీలో లక్షిత దాడులు చేస్తామన్న బీజేపీని నేతలను ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడించామని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మత రాజకీయాలను ఎదుర్కొనే సమర్థుడు కేసీఆర్ అని అన్నారు. కొన్ని స్థానాల్లో ఓటమి పాలైనంత మాత్రాన రాజకీయంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాము చాలా తక్కువ సీట్లలోనే పోటీ చేశామని, అయినా తమ సీట్లను నిలుపుకున్నామని అన్నారు. కేసీఆర్ ను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి చూస్తూనే ఉన్నానని, దక్షిణాదిన ఆయన గొప్ప భవిష్యత్ ఉన్న నేతఅని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.