FbTelugu

మినీ లాక్ డౌన్ లు విధించాలి: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మినీ లాక్‌డౌన్‌ల తక్షణావసరం ఉందని, వీలైనంత వరకూ ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు.

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. కోవిడ్-19 మేనేజిమెంట్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా కూడా గులేరియా ఉన్నారు.కరోనా కేసులు గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు. సెకెండ్ వేవ్ ఈ నెలలో తారాస్థాయిలో ఉండొచ్చని, అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా ప్రజలు ఏమాత్రం జాగ్రత్త వహించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా భౌతిక దూరం, మాస్కులు ధరించాలని ఆయన హెచ్చరించారు. లేని పక్షంలో ప్రాణాలకు ముప్పు తప్పదని గులెరియా అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.