FbTelugu

గతేడాదే అప్రమత్తం… కేంద్రం మొద్దునిద్ర!

న్యూఢిల్లీ: దేశంలో మరోమారు కరోనా వైరస్ విలయం సృష్టిస్తుందని ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కేంద్రాన్ని హెచ్చరించారు. ఆయన హెచ్చరించింది ఇప్పుడు కాదు. గతేడాది జూలై నెలలో హెచ్చరించినా కేంద్రం మొద్దునిద్ర పోతున్నది.
ప్రభుత్వాలు, ప్రజలు ఉదాసీనంగా ఉంటే భారీ నష్టం సంభవిస్తుందని ఆయన హెచ్చరించారు కూడా. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కూడా ఈ ఏడాది అదే విషయాన్ని నొక్కి చెప్పింది. సెకండ్ వేవ్ దేశంలో ఉధృతిగా ఉంటుందని ఈ ఏడాది మార్చి 9న కేంద్రాన్ని హెచ్చరించింది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ గఢ్ లలో సెకండ్ వేవ్ మొదలైందని, పట్టించుకోకపోతే దేశమంతా పాకుతుందని అప్రమత్తం చేశారు. అయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టించుకోకుండా కుంభకర్ణుడి మాదిరి నిద్రపోతున్నది. తమ అధికారాన్ని ప్రదర్శించుకునేందుకు ఎన్నికల సభల్లో విస్తృతంగా పాల్గొన్నారు. కుంభ మేళా కు అనుమతించి దేశంలో కరోనా విలయానికి ఆజ్యం పోశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా మహమ్మారి సమయంలో బహిరంగ సభలు, రోడ్డు షోలు నియంత్రించకుండా ఈసి ప్రేక్షక పాత్ర పోషించి లక్షలాది కేసులు పెరిగేలా చేసిందంటున్నారు. ఎన్నికలు, కుంభ మేళా మూలంగా దేశంలో మూల మూలకు వైరస్ వెళ్లిపోయింది. అలా ఒకరి నుంచి ఇద్దరికి ఇద్దరి నుంచి పది మందికి వ్యాపించి ప్రజలకు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.