FbTelugu

ప్రజల నిర్లక్ష్యమే కొంప ముంచింది: ఎయిమ్స్ డైరెక్టర్

న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ ఇంతగా విజృంభించడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తే ఇంతగా పెరిగేవి కావని ఆయన స్పష్టం చేశారు.
సెకండ్ వేవ్ ఉధృతిపై గులేరియా స్పందించారు. దేశంలో వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించాకా ప్రజలు ఎప్పటిలాగే నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారని, ఎప్పటి మాదిరే జీవించారన్నారు. ఈ సమయంలో వైరస్ జన్యు మార్పిడికి లోనయ్యి వేగంగా వ్యాపించడంతో కేసులు అమాంతం పెరిగాయన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వ్యాక్సినేషన్ మొదలైన తరువాత ప్రజలు నిబంధనలను గాలికి వదిలేశారన్నారు. ఈ సమయంలోనే వైరస్ తన రూపు మార్చుకుని మరింత వేగంగా విస్తరించన్నారు. ఈ సమయంలో దేశంలోని ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగిందనఇ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో ఇప్పటికైనా మౌలిక వసతులు పెంచాలని, రోజువారి కేసులను తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రసార, ప్రచార మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నాయని, ఇది సరికాదని డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.