FbTelugu

సిటీ స్కాన్ ఎందుకోసం?: ఎయిమ్స్ చీఫ్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తేలికపాటి లక్షణాలు ఉంటే సిటీ స్కాన్ చేయించుకున్న ప్రయోజనం ఉండదని ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. ఒక్క సిటీ స్కాన్ 300 చెస్ట్ ఎక్స్ రే లతో సమానమని ఆయన స్పష్టం చేశారు.

అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవడం మూలంగా డబ్బుల వృధాతో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. కొందరైతే అతి జాగ్రత్తతో చిన్న పిల్లలకు కూడా చేయిస్తున్నారని, ఇది దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యంపై అతి జాగ్రత్తతో ఇలాంటి పనులు చేస్తుంటారని, అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.