FbTelugu

కరోనాపై రెండు పార్టీల డ్రామా: కాంగ్రెస్ ధ్వజం

హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితిపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రికి నివేదికలు ఇవ్వకుండా ప్రకటనలు గుప్పించడం ఏంటని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ప్రశ్నించారు.

కేంద్రానికి గవర్నర్ నివేదికలు పంపితే నమ్మేవాళ్లమని ఆయన అన్నారు. కరోనా వైరస్ నియంత్రణ విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారన్నారు. కేంద్ర మంత్రులు వచ్చి పొగిడిపోతున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారం నిగ్గు తేలాలంటే గవర్నర్ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని శ్రావణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు, పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామా ఆడుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆరోపించారు.

You might also like