FbTelugu

కరోనా తో అహోబిలం మూసివేత

కర్నూలు: అహోబిలం ఆలయ పూజారి కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆలయ అధికారులు ఇవాళ అహోబిలం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
పూజారి నుంచి కుటుంబ సభ్యులు, ఇతర పూజారులకు సోకిందా అనే దానిపై పరిశీలిస్తున్నారు. ఆలయం మొత్తాన్ని శుద్ధి చేసి, మిగతా పూజారులకు పరీక్షలు నిర్వహించిన తరువాతే తెరవాలనే ఉద్దేశంతో ఉన్నారు.
పూజారికి కరోనా వచ్చిందని తెలియడంతో భక్తులు, ఆలయ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికే హోం క్వారంటైన్ కు వెళ్లారు. పూజారులను కూడా హోం క్వారంటైన్ కు పరిమితం చేశారు.

You might also like