FbTelugu

బాబు కులాల మధ్య చిచ్చి పెట్టారు: మంత్రి కన్నబాబు

విజయవాడ: ప్రజా సాధికార సర్వే ద్వారా సామాజిక వర్గాలను విడదీసి చంద్రబాబు కులాల మధ్య చిచ్చురేపారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.
జగన్మోహన్ రెడ్డి రాయలసీమ రెడ్డి కులస్థుడైనా అందరివాడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. గతంలో కాపు నుంచి రెల్లి కులస్థుడిగా మారతాను అని జనసేన అధినేత కొణిదెల పవనే ప్రకటించారన్నారు. కాపులకు ఆర్ధిక సాయం చేస్తే పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఉక్రోషం వస్తోందో అర్థం కావడం లేదు.

ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తానని రూ.100 కోట్లే ఇస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించలేకపోయారని గుర్తు చేశారు. చేనేత పనిలోనూ కాపులు ఉన్నారని, వారికీ నేతన్న నేస్తం ద్వారా సాయం అందిందని మంత్రి కన్నబాబు తెలిపారు. జగనన్న చేదోడు పధకం ద్వారా కూడా కాపులకు సాయం అందించామన్నారు.కాపు నేస్తం పధకం మేనిఫెస్టో లో లేదు. అయినా ఆర్ధిక సాయం చేస్తున్నామని ఆయన వివరించారు.

గత ప్రభుత్వంలో రిజర్వేషన్లు గురించి కాపులు ఉద్యమం చేసేటప్పుడు, వారిపై కేసులు పెట్టినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేక పోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాపులపై కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేసులు ఎత్తివేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఉందనే విషయం కాపులే ఆలోచించాలి అన్నారు.
పవన్ కల్యాణ్ చూసే వైఖరి లోనే తేడా ఉందని అనిపిస్తోందన్నారు. జగన్ ను మాత్రమే ప్రశ్నించటం పవన్ కల్యాణ్ ఫిలాసఫీ అనిపిస్తోందని, ఆయన ఇంకెవరినీ ప్రశ్నించరు అని అన్నారు. 2 లక్షల 30 వేల మంది కాపు, ఒంటరి, బలిజ మహిళలకు రూ.350 కోట్ల మేర అందించామన్నారు. కాపు రిజర్వేషన్లు గురించి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తోందన్నారు.
గత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉక్కుపాదం తో అణచివేసింది. పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఆయన మాట్లాడలేరా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి స్నేహితుడిగా ఉన్న పవన్ ముద్రగడ ను అణచివేస్తుంటే ఒక్క మాట కూడా పవన్ ఎందుకు మాట్లాడలేదో అందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు పట్ల ప్రేమను దాచుకోలేని తత్వం ఇది అని మంత్రి కన్నబాబు దెప్పి పొడిచారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.