FbTelugu

విశాఖపట్నం ఎయిర్‌పోర్టుపై ఒప్పందం

అమరావతి: విశాఖపట్నం భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వంతో జీఎంఆర్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సీఎం ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్‌ ప్రతినిధులు తెలిపారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

తాము పుట్టిన ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం జగన్ రెడ్డి మాట్లాడుతూ, ఉత్తరాంధ్రప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందని వ్యాఖ్యానించారు. ఎయిర్‌ పోర్టునుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని సీఎం చెప్పారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖనగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటు పైనా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు జగన్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ వీ.ఎన్ భరత్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, జీఎంఆర్‌ ఛైర్మన్‌ జీబీఎస్‌. రాజు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.