FbTelugu

విశాఖ స్టీల్ పై దూకుడుపెంచిన కేంద్రం

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రతిపక్షాలు ఎంతగా ఆందోళన చేస్తున్నా, సీఎం వైఎస్.జగన్ లేఖ రాసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రైవేటీకరణ చేసేందుకు దూకుడు పెంచింది.

గత వారం రోజులుగా కార్మికులు, విశాఖలోని పలు పార్టీలకు చెందిన నాయకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి వైసీపీ ఎంపీలు లేఖలు కూడా అందించారు. నష్టాల పేరుతో కంపెనీని తెగనమ్మడం సరికాదని కేంద్రాన్ని కోరాయి. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు, ప్రైవేటు బిడ్ దాఖలు చేసేందుకు అవసరమైన సాంకేతిక వివరాలు పంపించాల్సిందిగా కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి లేఖ పంపించింది. ప్లాంట్ సంబంధించిన పూర్తి వివరాలు, లాభనష్టాలు మొత్తం డాక్యుమెంట్ రూపంలో పంపించాలని మార్గదర్శకాలు సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.