FbTelugu

బంద్ కు వ్యతిరేకం: మమతా

కోలకతా: వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు పిలుపునిచ్చిన భారత్ బంద్ ను వ్యతిరేకిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే రైతుల డిమాండ్లకు తాము మద్దతిస్తున్నామని ఆమె తెలిపారు.

వెస్ట్ మిడ్నాపూర్ లోని ఒక ర్యాలీలో మమతా బెనర్జీ ఇవాళ మాట్లాడుతూ, రైతులకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. సవరణ చేయడం చేతకాకపోతే నరేంద్ర మోదీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలని ఆమె మండిపడ్డారు. రాఫెల్ కుంభకోణం, పీఎం కేర్స్ వివరాలను బీజేపీ ప్రభుత్వం బహిర్గతం చేయదు కాని, బెంగాల్ లో అఫన్ తుఫాన్ వల్ల జరిగిన నష్టం విషయంలో మాత్రమ లెక్కలడుతున్నారని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి రెండు నాల్కల ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మమతా బెనర్జీ చురకలంటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.