FbTelugu

మళ్లీ కొండెక్కింది!

బంగారం ధర వినియోగదారులతో దోబూచులాడుతోంది. ఒకరోజు తగ్గుతూ ఒకరోజు పెరుగుతూ ఉంది. మంగళవారం బంగారం ధర మళ్లీ పెరిగింది. దేశీయంగా వాటి ధరలు భారీగా పెరిగాయి.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్పల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో మంగళవారం (24 క్యారెట్లు) పది గ్రాముల బంగారం ధర సోమవారం కంటే 1190 రూపాయలు పెరిగి 48,420కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70 రూపాయలు పెరిగి 44,350 రూపాయలకు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.30 పెరిగింది. ఇప్పుడు కేజీ వెండి ధర 47,440కు చేరింది. మొత్తానికి బంగారం, వెండి ధరలు మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. ఈ నెల చివరి నాటికి బంగారం ధరలు 50వేలకు పైగా చేరుకోవచ్చని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

లాక్‌డౌన్‌ కాలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం భారీగా పడిపోయింది. దీంతో మదుపరుల చూపు బంగారం కొనుగోళ్లపై పడిందన్న ప్రచారం సాగుతోంది. దీనికి తోడు బ్యాంకుల వ్యవస్థ కూడా దీనికి తోడైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులకు వడ్డీ తగ్గించడం, రకరకాల పన్నులు వసూలు చేయడంలాంటి నిర్ణయాలను ఇటీవల కాలంలో బ్యాంకులు తీసుకున్నాయి. దీంతో మదుపరులు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి స్వస్థి పలికి వాటిని బంగారం కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టారని, అందుకే బంగారం ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఇంతగా ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం వైపు చూడాలంటేనే భయపడుతున్నారు.

You might also like