FbTelugu

మళ్లీ సరి బేసీ విధానం

Again-numerical-odd-number-policy

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా నేటి నుండి ఢిల్లీ నగరంలో సరి-బేసి విధానాన్ని అప్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. నేటి నుంచి నవంబర్ 15 వరకు సరి-బేసి విధానం అమలులో ఉండనుంది. ఆదివారం మినహా ఇతర రోజుల్లో అమలులో ఉంటుందని తెలిపారు. తేదీల ఆధారంగా, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు సరి-బేసి విధానం అమలు చేయనున్నారు. నిబంధనలను ఉల్లంగిస్తే 4వేల రూపాయలు జరిమానా కూడా విధించనున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లకు, ఛీఫ్ జస్టిస్, లోక్ సభ స్పీకర్, కేంద్రమంత్రులు, రాష్టాల ముఖ్యమంత్రులకు, లోక్ సభ ,రాజ్యసభ ప్రతిపక్ష నాయకులకు సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఉండనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి వాహనానికి మినహాయింపు లేదు సరి-బేసి విధానం వర్తింపు ఉంటుంది. దివ్యాంగులు, స్కూల్ పిల్లలను తీసుకువెళ్లే వాహనాలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంది. ఈ ఏడాది సీఎన్జి వాహనాలకు మినహాయింపు ఇవ్వలేదు. సొంతగా వాహనాలు నడిపే మహిళలకు సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. తొలిసారిగా 2015 లో సరి-బేసి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసింది.

You might also like