FbTelugu

మళ్లీ మున్సిపల్ నోటిఫికేషన్‌ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పై సుప్రీంకోర్టులో విచారణ జరపాలంటూ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

మున్సిపల్‌ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని కడప జిల్లా వాసులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటీషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలను ప్రారంభించాలన్న పిటిషన్‌ను కొట్టివేసింది. నోటీఫికేషన్ జారీ చేసిన తరువాత ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్ఈసీ) హక్కు అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.