FbTelugu

హైకోర్టు జడ్జీలపై మళ్లీ అనుచిత పోస్టింగ్ లు

చర్యలు తప్పవని హెచ్చరించిన ఏపి సిఐడి
అమరావతి: గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు ప్రచారం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సిఐడి దృష్టికి వచ్చింది,
గతేడాది కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టింగ్ లు పెట్టారు. వారు ఇచ్చిన తీర్పులపై వక్రభాష్యాలు చెబుతూ కామెంట్లు పెట్టారు. వీటిపై ఆగ్రహించిన హైకోర్టు విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపి సిఐడిని ఆదేశించిన విషయం తెలిసిందే. కొందరి అనుమానితులకు సిఐడి నోటీసులు కూడా జారీ చేసింది. వారిలో వైసిపికి చెందిన అభిమానులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ లో ఉండగానే మళ్లీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టింగ్ లు ప్రారంభించడం కలకలం రేపుతున్నది. గతంలో హైకోర్టు వారు ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసిందని ఏపి సిఐడి వెల్లడించింది.

నెటిజన్లు, ప్రజలు… రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై ఇలాంటి పోస్టులు సృష్టించడం, వాటిని షేర్ చేయడం, లైకులు చేయడం, ఆపై కామెంట్లు చేయడం నేరమని హెచ్చరించింది. ఇలాంటి పోస్టులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలుసుకునేందుకు సిఐడి, సోషల్ మీడియా ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ లోతుగా దర్యాప్తు చేస్తున్నదని తెలిపింది. తమ దర్యాప్తులో దోషులుగా తేలితే ఎంతటి వారైనా ఏరాష్ట్రం లో, ఏదేశం లో ఉన్నా కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కుట్రపూరితంగా కొంతమంది ఒక పథకం ప్రకారం ఇలా రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నట్టు మా దృష్టికి వచ్చిందని, ఆ కోణంలో కూడా విచారణ జరుగుతుందని ఏపి సిఐడి తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.