FbTelugu

అమెరికా చరిత్రలో 60ఏళ్ల తరువాత…

వాషింగ్టన్: అమెరికా చరిత్రలో ఆరు దశాబ్ధాల తరువాత ఒక మహిళకు ఉరి తీసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండియానా స్టేట్ లోని టెర్రెహాటె లో డిసెంబర్ 8వ తేదిన ఆమెను ఉరితీయాలని కోర్టు సమయం కూడా ఖరారు చేసింది.

ఆమె ఉరితీత అమలైతే 60 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారి అవుతుందని అంటున్నారు. క్రూరమైన, ఘోరమైన నేరాలకు తప్పిస్తే సాధారణంగా ఉరిశిక్ష విధించే అవకాశాలు చాలా స్వల్పం. లీసా మాంటో గోమరి 2004 డిసెంబర్ లో మిస్సోరిలోని స్కిడ్ మోర్ లో నిండు గర్భవతిని అతి కిరాతకంగా చంపేసింది. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న బొబ్బి జో స్టిన్నెట్ ను కడుపు కోసివేసి, గర్భస్త శిశువును ఎత్తుకెళ్లింది. రక్తస్రావంతో బొబ్బి ప్రాణాలు విడిచింది. అలా తెచ్చుకున్న పసికందును తన పాపగా చెప్పుకునేందుకు ప్రయత్నించి పొలీసులకు దొరికిపోయింది.

లీసా తరఫున క్షమాభిక్ష పిటీషన్ వేయించేందుకు టెక్సాస్ జైలు కు వెళ్లిన ఆమెను కలిసిన ఇద్దరు అడ్వకేట్లకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఉరిశిక్షను వాయిదా వేయాల్సిందిగా జడ్జి రాండల్ఫ్ మోజ్ ను కోరగా, పరిగణనలోకి తీసుకున్న ఆయన తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఉరి వాయిదా వేయాలని ఆదేశించారు. డిసెంబర్ 25 లోగా దాఖలు చేయాలని ఆదేశించారు. క్షమాభిక్ష దాఖలు చేస్తారా లేదా అనేది మరో ఐదు రోజులు గడిస్తే కాని తెలియదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.