వాషింగ్టన్: అమెరికాలో జరుగుతున్న జాత్యాహంకార ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ రక్షణ మంత్రి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
యూఎస్ చరిత్రలో తొలిసారి ఆఫ్రికన్-అమెరికన్ ను రక్షణ మంత్రిగా ఎన్నుకున్నారు. ఈ పదవిలోకి రిటైర్డు జనర్ లాయిడ్ ఆస్టిన్ ను ఎంపిక చేశారు. తన కేబినెట్ లో మైనారిటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న రక్షణ శాఖ మాజీ అండర్ సెక్రెటరీ మిచెల్ ఫ్లోర్నోయ్ ఒత్తిడే మరేకు ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ అయిన లాయిడ్ ఆస్టిన్ (67)ను ఎంపిక చేసినట్లు తెలిసింది. శుక్రవారం ఆయన నియామకాన్ని బైడెన్ అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆస్టిన్ నాలుగు దశాబ్దాల పాటు అమెరికా సైన్యంలో సేవలందించారు. 2003లో ఇన్ ఫాంట్రా డివిజన్ కు అసిస్టెంట్ డివిజనల్ కమాండర్ గా వ్యవహరించారు. ఇరాక్ పై దాడిలో యూఎస్ బలగాలను కువైట్ నుంచి బాగ్దాద్ లోకి తీసుకువెళ్లారు. ఆ తరువాత అనేక పదవులను అధిష్టించిన ఆయన 2016లో సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. పెంటగాన్ అతి పెద్ద కాంట్రాక్టర్ అయిన రేథియాన్ టెక్నాలజీ బోర్డులో డైరెక్టర్ గా చేరారు.