FbTelugu

ఆర్టీసీ పై సర్కార్ పాట…

Affidavit-on-TSRTC-Losses

అఫిడివిట్ లో నష్టాల వివరాలు

హైదరాబాద్: హైకోర్టులో సోమవారం నాడు ఆర్టీసీపై వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీపై అఫిడవిట్ సమర్పించనున్నది. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల ఊబిలో ఉందని వివరాలు అందచేస్తున్నట్లు తెలిసింది. మొత్తం ఆర్టీసీ బకాయిలు ₹ 2209.66 కోట్లు ఉన్నాయి. ఈ నెల 8వ తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీ బకాయిల వివరాలు ఇలా ఉన్నాయి.

పీఎఫ్‌ బకాయిలు రూ.788.30 కోట్లు.

క్రెడిట్‌ కోఆపరేటీవ్ సొసైటీ బకాయిలు రూ.500.95 కోట్లు.

లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ (2014- 2018) రూ.180 కోట్లు.

రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సెటిల్‌మెంట్స్‌ రూ.52 కోట్లు.

మోటారు వెహికిల్‌ యాక్టు (2017-2019) రూ.452.36 కోట్లు.

హెచ్‌ఎస్‌డీ ఆయిల్‌ బిల్స్‌ రూ. 34.45 కోట్లు.

హెచ్‌ఓ, రీజియన్‌, జోన్‌ ఇతర బకాయిలు రూ.36.40 కోట్లు.

ప్రైవేట్‌ బస్సుల బకాయిలు రూ.25 కోట్లు.

ఆర్టీసీ బస్సు మరమ్మతుల బకాయిలు రూ.60 లక్షలు.

You might also like